2, సెప్టెంబర్ 2010, గురువారం

బ్లాగోదంతం

పిల్లలతో పాటు విజ్ఞానం అంటే ఇదేనేమో
పిల్లలు వాడుతుంటే చూడడం తప్ప నాకు కంప్యూటర్
గురించిన జ్ఞానం లేదు. కానీ వాళ్ళు జాబ్స్ కి వెళ్ళిన
తరువాత కోతి కి కొబ్బరికాయ దొరికినట్లు నాకు కంప్యూటర్ చిక్కింది.
నాకు మా పిల్లలే ఆన్ కాల్ సపోర్ట్.
మొత్తానికి కంప్యూటర్ లో మెయిల్స్ పంపడం చాట్ చెయ్యడం
నేర్చుకున్నా.ఇరవై నాలుగు ఘంటలు చాట్ చేస్తుంటే వాళ్ళకి కూడా పాపమూ బోర్ కదా,,
అందుకే మా వాడు ఈ బ్లాగును సృష్టించాడు.నాకు కాలక్షేపము కలిగించాడు.
ఆఫీసు లో చేసే ఆన్ కాల్ సపోర్ట్ కన్నా నీకే ఎక్కువ చేస్తున్నా అంటుంది మా అమ్మాయి.
ఖాళీగా వున్న మా లాంటి వాళ్ళకి ఇది విజ్ఞానదాయకమా కదా చూడాలి మరి.
బ్లాగులు రాసినా, లేకపోయినా ఏమిటి రాయాలి అన్న ఆలోచనలోనే కాలము గడిచిపోతోంది.
సో నో ప్రాబ్లం డాక్టరేట్ చేసిన వాళ్ళకి కంప్యూటర్ తెలియదా అంటే చెప్పలేను కానీ
నేను యెప్పుడు ప్రయత్నించలేదు .
సో wish me all the best.
by
jyothi ram.

1 కామెంట్‌: