3, సెప్టెంబర్ 2010, శుక్రవారం

ఆ రాత్రి పది పన్నెండు మధ్య

ఏమి జరిగింది?
ఇది క్రైం వాచ్ కాదు .నేను మాములుగా సీరియల్స్ అయిన తరువాత న్యూస్ ఛానల్ పెట్టాను.అన్ని చానల్స్ లోను ఒకటే బ్రేకింగ్ న్యూస్ నల్లమల్ల అడవులలో ఏదో జరిగింది? ఏమిటి అది?
బ్రేకింగ్ న్యూస్ ప్రసారాలు ఎలాగావుంటాయో మీకు తెలుసు కదా....చానల్స్ వాళ్ళ ఉహాగానాలు మొదలయ్యాయి .
లైవ్ కాల్స్ కూడా మొదలయ్యాయి. చూసే వాళ్ళ గుండెల్లో రైళ్ళు పరుగెత్తడము కూడా మొదలయింది. లైవ్ కాల్స్ లో చెప్ప్తున్న న్యూస్ ఒకటి. బ్రేకింగ్ న్యూస్ లో చూపిస్తున్నది ఒకటి. ఎక్కడ పొంతనలేదు.ఒక ఛానల్ లో శబ్దము పొగ మాత్రమే అని చెప్తే ఇంకొక ఛానల్ మంటలు కూడా అని ప్రసారము చేస్తోంది. తరువాత కొద్దిసేపటికి ఉహాగానాలు వూపన్దుకున్నాయి.
అలాగే ప్రేక్షకులలో టెన్షన్ కూడా..ఇకచెప్పడానికి ఏముంది? వరుసుగా ఆ టైం లో ఉన్న విమానాలకి చావు పుట్టుకలు మొదలయ్యాయి. ఒకసారి బెంగుళూరు , ఒకసారి చెన్నై విమానాలంటూ ప్రేక్షకులని అదరగొట్టారు. చివరకి ఒక విమానం పేరు నెంబర్ కూడా బ్రేకింగ్ న్యూస్ అంటూ చూపించడము మొదలయ్యింది. కామెడీ ఏమిటి అంటే ఆ ఛానల్ వాళ్ళు ఫోన్ లైవ్ లో మాట్లాడుతున్నారు.ఒక పక్క పెద్ద పెద్ద మంటలు చూపిస్తున్నారు . లైవ్ లో పెద్ద శబ్దము అయి పొగ వస్తోంది కానీ మంటలు లేవు అని చెప్తున్నారు.
స్క్రోలింగ్ లో ఎయిర్పోర్టు అధికారులు అన్ని విమానాలు క్షేమమని చూపిస్తున్నారు. మనకి కనిపించేది మాత్రమూ విమానము పేరు నెంబర్ మంటలు. ఏది నిజమో తెలియక మనకి కంగారు. నేను వెంటనే ఫోన్ తీసి మా వాడికి ట్రై చెయ్యబోయ. నువ్వు వాళ్ళలాగే వున్నావు అంటూ మా వారు నా ఫోన్ లాక్కున్నారు. మెస్టిక్ విమానము కదా ఎవరయినా తెలిసనవాళ్లు వున్నారేమో అని భయము. నేను పడుకున్నాను కానీ మనసంతా ఆలోచనలే.. . నెమ్మదిగ లేచి మల్లి టి.వి.ఆన్ చేశా.పన్నెండు అయివుంటుంది. అన్ని చానల్స్ లో హాయిగా సినిమా కబుర్లు. ఏదో ఒక చానెల్ లో చెన్నై అధికార్లు కూడా తమ విమానాలన్నీ ల్యాండ్ అయ్యాయి అన్న వార్త స్క్రోల్లింగ్ లో చూసా ఓ.కే. హ్యాపీ. కానీ మర్నాడు అసలు ఏమయివుంటుంది అన్న ఆలోచన.
ఉల్క అయివుంటుందని, వర్షము కారణముగా ఎవరు వెళ్ళడానికి సాధ్యము కాలేదని స్క్రోలింగ్లో వార్త చూసాను.
కానీ న్యూస్ చానల్స్ వాళ్ళు మాత్రమూ ఆ విషయమే మర్చిపోయారు. ఆ రాత్రి ఆ రెండు గంటలు ఎంతమంది టెన్షన్ పడ్డారో కదా..వార్త అంటే జరిగిన విషయాలు, జరుగుతున్న విషయాలు మాత్రమే చెప్తారు అని అనుకుంటే పొరపాటే సుమా...,ఏమి జరిగివుంటుందో (అది చెడు మాత్రమే) ఊహించి చెప్పగల సామర్ధ్యం మన మీడియాదే సుమా .
వాళ్ళు వుహించుకున్న జవాబులు రాబట్టుకోవడం మీడియా వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య కదా ...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి